epaper
Monday, February 23, 2026
epaper

విజయ్-రష్మిక పెళ్లి సందడి షురూ.. ఉదయ్‌పూర్‌లో గీతగోవిందం జంట

కలం, వెబ్ డెస్క్: ఉదయ్‌పూర్ (Udaipur) వేదికగా టాలీవుడ్ మోస్ట్ క్రేజీ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న (Vijay-Rashmika) పెళ్లి సందడి మొదలైంది. వివాహ వేడుక కోసం ఈ జంట సోమవారం ఉదయ్‌పూర్‌ చేరుకుంది. ఎయిర్‌పోర్ట్‌లో రష్మిక ‘గర్ల్ బాస్’ లుక్‌లో మెరిసిపోతూ అటు మీడియాను, ఇటు అభిమానులను ఆకట్టుకుంది. విజయ్ దేవరకొండ కూడా ఫ్రెష్ లుక్‌తో ఆకట్టుకున్నాడు. అభిమానుల వైపు చేయి ఊపుతూ ఈ జంట అభివాదం చేసింది. వీరిద్దరి రాకతో రాజస్థాన్‌‌కు పెళ్లి కళ సంతరించుకుంది.

ఈ వేడుక కోసం ఇరు కుటుంబ సభ్యులు ఇప్పటికే ఉదయ్‌పూర్ చేరుకున్నారు. విజయ్ దేవరకొండ తన తండ్రితో కలిసి వివాహ (Marriage) వేదికకు కారులో బయలుదేరగా, ఆయన తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా వారితో ఉన్నాడు. మరోవైపు, రష్మిక తల్లి, సోదరి శిమన్ కూడా విమానాశ్రయంలో కనిపించారు. ప్రస్తుతం ఈ జంటతోపాటు వారి కుటుంబ సభ్యులు ఉదయ్‌పూర్‌లోని విలాసవంతమైన రిసార్ట్‌కు చేరుకున్నారు. అక్కడ మరికొద్ది రోజుల్లో వీరి వివాహ వేడుక అట్టహాసంగా జరగనుంది. ప్రస్తుతం విజయ్, రష్మిక (Vijay-Rashmika)కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Read Also: అల్లు శిరీష్ వివాహానికి పవన్ కల్యాణ్, నాగబాబులకు ఆహ్వానం

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>