కలం, డెస్క్ : తన పేరుతో ఎలాంటి సంస్థలు పెట్టొద్దని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. తన పేరుతో కొన్ని సంస్థలు పెట్టడంపై కేటీఆర్ స్పందించారు. కేటీఆర్ సేవా సమితి, కేటీఆర్ సేన లాంటివి అస్సలు వద్దని.. వాటిని అస్సలు ప్రోత్సహించేది లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. ఏదైనా బీఆర్ ఎస్ పరిధిలోనే ఉండాలన్నారు. పార్టీకి మించి వ్యక్తిగత పేరుతో సంస్థలు, సంఘాలు ఉండటాన్ని తాను గతంలోనూ వద్దని చెప్పినట్టు కేటీఆర్ గుర్తు చేశారు. ఒకవేళ తన పేరుతో ఎవరైనా సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే.. పార్టీతో కలిసి చేయొచ్చని సూచించారు కేటీఆర్.
Read Also: వీడ్కోలా? పొడిగింపా? స్టేట్ మీడియా అకాడమీ చైర్మన్ పోస్టుపై సస్పెన్స్
Follow Us On: Sharechat


