కలం, వెబ్ డెస్క్: నేడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (AP Assembly Session) 8వ రోజు కొనసాగుతుండగా.. మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) అసెంబ్లీ లాబీలో మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీకి ఎవర్నీ బొట్టు పెట్టి పిలువరు. శాసన సభ్యులు తమ బాధ్యతతో, స్వచ్ఛందంగానే సభకు రావాలి అని లోకేశ్ తెలిపారు. లడ్డూ కల్తీకి సంబంధించిన వాస్తవాలు, దేవుడికి జరిగిన మహాపచారం అసెంబ్లీ వేదికగా బయటపెడతాం. దేవుడిని సైతం వైసీపి రోడ్డు మీదకు తీసుకురావడం బాధాకరం అని ఆయన పేర్కొన్నారు. దేవుడి ఫోటోలతో చట్ట సభలలో ర్యాలీలు నిర్వహించడం ఆక్షేపణీయని.. వైసీపీ చేసిన తప్పుని ప్రజలకు తెలియజేస్తామని లోకేశ్ తెలిపారు.


