epaper
Monday, February 23, 2026
epaper

ట్రంప్​ ‘వింటర్​ వైట్​హౌస్​’లో సాయుధుడి కాల్చివేత

కలం, వెబ్​ డెస్క్​: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ఎస్టేట్​ ‘మార్​ ఎ లాగో’(Mar a Lago)లో ఆదివారం సాయుధుడు చొరబడడం కలకలం సృష్టించింది. సకాలంలో గుర్తించిన భద్రతా దళాలు దుండగుడిని మట్టుబెట్టాయి. స్థానిక కౌంటీ షెరీఫ్​ చెప్పిన వివరాల ప్రకారం.. శనివారం అర్ధరాత్రి(తెల్లారితే ఆదివారం) 1.30 సమయంలో షాట్​గన్​, ఆయిల్​ క్యాన్​ పట్టుకున్న వ్యక్తి నార్త్​ గేట్​ వద్ద సీక్రెట్​ సర్వీస్​ ఏజెంట్ల కంట పడ్డాడు. వెంటనే, అప్రమత్తమై అతడిని కాల్చి చంపారు. అనంతరం స్థానిక పోలీసులకు సమాచారమిచ్చారు. వాళ్లు వచ్చి, పరిశీలించి దుండగుడు నార్త్​ కరోలినాకు చెందిన యువకుడిగా గుర్తించారు. ఆ యువకుడికి 20‌‌ ఏళ్ల లోపు వయసుంటుంది. అతడు కొన్ని రోజుల నుంచి కనిపించడం లేదంటూ వాళ్ల కుటుంబం ఫిర్యాదు చేసిన విషయం పోలీసులు తెలుసుకున్నారు.

కాగా, ట్రంప్​కు వింటర్​ వైట్​హౌస్​గా పేరు పెందిన మార్​ ఎ లాగో(Mar a Lago) నివాసం ఫ్లోరిడాలోని వెస్ట్​ పామ్​ బీచ్​ ఒడ్డున ఉంది. వీకెండ్స్​లో ఇక్కడ ట్రంప్​ కుటుంబంతో గడుపుతుంటారు. అయితే, ఆదివారం సంఘటన జరిగిన సమయంలో ట్రంప్​, ఆయన భార్య మెలానియా ఇద్దరూ వాషింగ్టన్​లోని అధికారిక నివాసం వైట్​హౌస్​లో ఉండడంతో ప్రమాదం తప్పింది. మరోవైపు దుండగుడు ఏ ఉద్దేశ్యంతో చొరబడ్డాడు? అతని వెనక ఏమైనా బలమైన కారణాలు ఉన్నాయా? అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అధ్యక్షుడి ఎస్టేట్​ వద్ద ఘటన జరగడంతో ఎఫ్​బీఐ సైతం రంగంలోకి దిగింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>