Mobile Popup Ad
Mobile Popup Ad

51కే 5 వికెట్లు.. తడబడిన భారత్ బ్యాటింగ్

కలం, వెబ్‌ డెస్క్:  దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ బ్యాటింగ్ (india collapse) పూర్తిగా కుదేలైంది. లక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే వికెట్లు కోల్పోయిన భారత్ కేవలం 51 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. ఓపెనర్లు నిలదొక్కుకోలేకపోవడం భారత్‌కు పెద్ద దెబ్బగా మారింది. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. దక్షిణాఫ్రికా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు రావడం కూడా కష్టమైంది.

పవర్‌ప్లేలోనే వరుసగా వికెట్లు పడటంతో మ్యాచ్‌పై దక్షిణాఫ్రికా పట్టు సాధించింది. మధ్య వరుస బ్యాటర్లు ఇన్నింగ్స్‌ను నిలబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ దశలో భారత్ తిరిగి కోలుకుంటుందా లేదా అన్నది మ్యాచ్‌లో కీలకంగా మారింది. ప్రస్తుతం భారత్ 5 వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది. క్రీజ్‌లో పాండ్యా, దూబే ఉన్నారు. భారత్ ఆటతీరుతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురవుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>