epaper
Monday, February 23, 2026
epaper

అభిషేక్ శర్మ వైఫల్యం.. టీమిండియా టాప్ ఆర్డర్ కుప్పకూలింది!

కలం, స్పోర్ట్స్:   అభిషేక్ శర్మ మళ్ళీ నిరాశపరిచాడు. ఈసారయినా అదరగొడతాడు అనుకుంటే 15 పరుగులకే వికెట్‌ను సమర్పించుకున్నాడు. 188 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ను ఆదుకోవాల్సిన సమయంలో, అభిషేక్ కొట్టిన రెక్లెస్ షాట్ అతడిని పెవిలియన్‌కు చేర్చింది. ఈ టోర్నీలో వరుసగా మూడు డకౌట్ల తర్వాత ఈ మ్యాచ్‌లోనైనా రాణిస్తాడని ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురైంది.

దక్షిణాఫ్రికా బౌలర్లు నిప్పులు చెరుగుతున్న వేళ, అభిషేక్ శర్మ కేవలం 15 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగారు. కగిసో రబడా బౌలింగ్‌లో ఒక సిక్సర్, రెండు ఫోర్లు కొట్టి ఫామ్‌లోకి వచ్చినట్లు కనిపించినా.. లుంగీ ఎన్గిడి వేసిన నెమ్మదైన బంతిని అంచనా వేయడంలో పొరబడి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో పవర్‌ప్లే ముగియకముందే భారత్ తన ముగ్గురు కీలక బ్యాటర్లను కోల్పోయింది. అంతకుముందే మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ (0), వన్ డౌన్ బ్యాటర్ తిలక్ వర్మ (1) తక్కువ పరుగులకే అవుట్ కావడంతో భారత్ తీవ్ర ఒత్తిడిలో పడింది. ఒకానొక దశలో 26 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన భారత్.. ప్రస్తుతం పీకల్లోతు కష్టాల్లో ఉంది. ప్రస్తుతం క్రీజ్‌లో 10 బంతుల్లో 10 పరుగులు చేసి సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ ఔట్‌తో వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు. సుందర్ ప్రస్తుతం 5 బంతుల్లో 2 పరుగులు చేశాడు. దీంతో భారత స్కోర్.. 3 వికెట్లు కోల్పోయి 29 పరుగులు చేసింది.

Read Also: యాదాద్రి దర్శనం చాలా కాస్ట్‌లీ‌ గురూ.. ప్యాకేజ్‌ని బట్టి వరాలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>