epaper
Sunday, February 22, 2026
epaper

ఇషాన్, తిలక్ ఔట్.. అహ్మదాబాద్‌లో భారత్ విలవిల!

కలం, స్పోర్ట్స్:  IND vs SA | నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న ఈ హై-వోల్టేజ్ పోరులో భారత్ ఛేదన అత్యంత పేలవంగా ప్రారంభమైంది. ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌లోనే స్టార్ ఓపెనర్ ఇషాన్ కిషన్ ఖాతా తెరవకుండానే డకౌట్‌గా వెనుదిరిగి అభిమానులకు షాక్ ఇచ్చారు. మార్కో జాన్సెన్ వేసిన పదునైన బంతికి క్లీన్ బౌల్డ్ అయిన ఇషాన్ (Ishan Kishan), జట్టుకు ఆశించిన ఆరంభాన్ని ఇవ్వలేకపోయారు. ఇషాన్ నిష్క్రమణతో క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మపై (Tilak Varma) అందరూ ఆశలు పెట్టుకున్నారు. అయితే సఫారీ బౌలర్ల ధాటికి తిలక్ కూడా ఎంతో సేపు నిలవలేకపోయారు. అనవసర షాట్‌కు ప్రయత్నించి తక్కువ పరుగులకే వెనుదిరగడంతో భారత్ టాప్ ఆర్డర్ ఒక్కసారిగా కుప్పకూలింది.

వరుస ఓవర్లలో రెండు కీలక వికెట్లు పడటంతో స్టేడియంలోని వేల మంది అభిమానులు నిశ్శబ్దంగా ఉండిపోయారు. ప్రస్తుతం జట్టును ఆదుకోవాల్సిన బాధ్యత మిడిల్ ఆర్డర్‌పై పడింది. వరుస డకౌట్ల తర్వాత ఈ మ్యాచ్‌లో (IND vs SA) పరుగుల ఖాతా తెరిచిన అభిషేక్ శర్మ, ఇప్పుడు ఆచితూచి ఆడుతున్నారు. మరోవైపు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ క్రీజులోకి వచ్చి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం భారత్ రెండు వికెట్లు కోల్పోయి 13 పరుగులు చేసింది.

Read Also: ఇండియా టార్గెట్ 188.. దంచికొట్టిన దక్షిణాఫ్రికా

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>