epaper
Sunday, February 22, 2026
epaper

పాక్​ సరిహద్దులో ఇద్దరు పోలీసుల అనుమానాస్పద మృతి

కలం, వెబ్​ డెస్క్: పాకిస్థాన్​ సరిహద్దులోని అవుట్​పోస్ట్​ ​(Gurdaspur) వద్ద ఇద్దరు భారత పోలీసులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ సంఘటన ఆదివారం పంజాబ్​లోని గురుదాస్​పూర్​ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాక్​ సరిహద్దులోని డోరంగ్ల చెక్​పోస్ట్​ వద్ద విధులు నిర్వహిస్తున్న ఏఎస్​ఐ గుర్నామ్​ సింగ్​, హోంగార్డ్​ అశోక్​ కుమార్​ చనిపోయి ఉండడాన్ని ఆదివారం తెల్లవారుజామున గుర్తించారు. మృతుల శరీరాలపై బుల్లెట్​ గాయాలు ఉన్నాయి.

అవుట్​పోస్ట్​లోని(Gurdaspur) ఓ గదిలో మృతులిద్దరూ బుల్లెట్​ గాయాలతో పడి ఉండడంతో ఇది పక్కా ప్రణాళిక ప్రకారం చేసిన దాడిగా అనుమానిస్తున్నారు. శనివారం అర్ధరాత్రి 1గంట సమయంలో ఈ ఘటన జరిగి ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.

ఏదైనా వివాదం కారణంగా పరస్పరం కాల్చుకొని చనిపోయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, డ్రగ్స్​ మాఫియా గ్యాంగ్​స్టర్లు, ఉగ్రవాదుల చొరబాటు కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు గురుదాస్​పూర్​ సీనియర్​ సూపరింటెండ్​ ఆఫ్ పోలీస్​(ఎస్​ఎస్​పీ) ఆదిత్య శర్మ తెలిపారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ ప్రాంతం అత్యంత సున్నితమైన ఇండియా–పాకిస్థాన్ (India – PAK)​ ఇంటర్నేషనల్​ బోర్డర్​ (ఐబీ) వద్ద ఉండడంతో భద్రత దళాలు అప్రమత్తమయ్యాయి. సంఘటన సరిహద్దు ప్రాంతంలో జరగడంతో పంజాబ్​ మొత్తం అలెర్ట్​ ప్రకటించారు.

Read Also: నాడు కుంభకోణాలు.. నేడు అభివృద్ధి : ప్రధాని మోడీ

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>