కలం, వెబ్ డెస్క్ : మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి (Alla Ramakrishna Reddy) కి ఏసీబీ (ACB) నోటీసులు జారీ చేసింది. అమరావతి (Amaravati) ఇన్నర్ రింగ్ రోడ్ కుంభకోణం కేసులో భాగంగా ఈ నోటీసులు అందజేశారు. ఈ కేసుకు సంబంధించి కోర్టులో హాజరై తన వాదనలు వినిపించుకోవచ్చని నోటీసుల్లో పేర్కొన్నారు. అధికారులు జారీ చేసిన నోటీసుల ప్రకారం ఈ నెల 27న విజయవాడలోని ఏసీబీ కోర్టుకు తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాజెక్టుకు సంబంధించిన అవకతవకలపై ఇప్పటికే దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆళ్ల రామకృష్ణా రెడ్డి కోర్టుకు హాజరవుతారా లేదా అన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Read Also: రచయిత బొగ్గుల శ్రీనివాస్ హత్య కేసు.. వీడిన మిస్టరీ
Follow Us On : WhatsApp


