epaper
Sunday, February 22, 2026
epaper

మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

కలం, వెబ్ డెస్క్ : బంగారం, వెండి ధరలు (Gold Silver Prices) మరోసారి పెరిగాయి. పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ నడుస్తున్న వేళ ఈ పెరుగుదల కొనుగోలుదారులకు మరింత భారంగా మారుతోంది. ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,280 గా నమోదైంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,000కి చేరింది. గత కొద్ది రోజులుగా స్వల్ప మార్పులు కనిపించినప్పటికీ, తాజాగా ధరలు మరోసారి పెరిగాయి.

వెండి ధర సైతం పెరిగింది. హైదరాబాద్ లో కిలో వెండి ధర (Silver Price) రూ.2,90,000గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో మార్పులు, డాలర్ మారకం విలువ, డిమాండ్ పెరగడం వంటి అంశాలు ఈ ధరల పెరుగుదలకు కారణాలుగా భావిస్తున్నారు. అయితే ధరలు (Gold Silver Prices) ఇంకా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. కాబట్టి బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునేవారు మార్కెట్ పరిస్థితులను గమనిస్తూ సరైన నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Read Also: నేటి మ్యాచ్ అభిషేక్ శర్మకు అగ్నిపరీక్ష

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>