కలం, వెబ్ డెస్క్ : నేడు నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్ (Ahmedabad) వేదికగా ఇండియా–సౌత్ ఆఫ్రికా(India vs South Africa) మ్యాచ్ జరగనుంది. సూపర్ 8లో మొదటి మ్యాచ్ కావడంతో ఇరు జట్లకు ఇది అత్యంత కీలకం కానుంది. సెమీఫైనల్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలి. అయితే అభిమానుల ఆందోళన అంతా అభిషేక్ శర్మ (Abhishek Sharma) పైనే ఉంది.
ఈ వరల్డ్ కప్‌లో ఇప్పటివరకు మూడుసార్లు డకౌటై నిరాశపరిచిన అభిషేక్, ఈరోజు మ్యాచ్‌లో ఫామ్‌లోకి తిరిగి రావాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో విఫలమైతే జట్టులో అతని స్థానం ప్రమాదంలో పడే అవకాశముంది. దీనితో క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో అతనికి మద్దతుగా ట్వీట్లు, పోస్ట్‌లు చేస్తూ ఉత్సాహాన్ని పెంచుతున్నారు.
Read Also: నేడు ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్
Follow Us On: X(Twitter)


