epaper
Sunday, February 22, 2026
epaper

పేరుకే ‘అమీర్’పేట్.. నైన్టీస్ నాటి ఎమోషన్ ఇప్పుడిలా..

కలం, తెలంగాణ బ్యూరో: అమీర్‌‌‌‌పేట్ (Ameerpet).. ఐటీ కొలువుల ట్రైనింగ్‌‌కు అడ్డా! కంప్యూటర్ కోర్సుల ఇన్‌‌స్టిట్యూట్లకు కేరాఫ్ అడ్రస్​! ఎన్నో ఆశలతో పల్లె నుంచి పట్టణానికి చేరే యువతకు స్టార్టింగ్ పాయింట్!
ఇక్కడ గల్లీ గల్లీకి కోచింగ్ సెంటర్లు.. బిల్డింగ్​ల నిండా ఊరించే ఉద్యోగాల బోర్డులు. 1990లో ఆరంభమైన అమీర్‌‌‌‌పేట్ ఐటీ ప్రస్థానం.. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే!!

అమీర్‌‌‌‌పేట్.. ఒకప్పుడు చిన్న ఊరు. కాలక్రమంలో హైదరాబాద్ విస్తరించడంతో సిటీ నడిబొడ్డున ఉన్న ప్రాంతంగా మారింది. కానీ అభివృద్ధిలో మాత్రం వెనుకబడే ఉంది. దీనికి పక్కనే ఉన్న ప్రాంతాలు ఎంతో డెవలప్‌‌ అయినా.. ఇది మాత్రం ఇంకా నైంటీస్‌‌ దగ్గర్నే ఆగిపోయింది.

ఐటీ జాబ్స్ కొట్టేందుకు అమీర్‌‌‌‌పేట్ శిక్షణా కేంద్రమైతే.. ఐటీ జాబ్స్‌‌ చేసేవాళ్లకు గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ, రాయదుర్గం వర్క్​ సెంటర్లు! ఆ సెంటర్లన్నీ అద్దాల మేడలతో అందంగా వెలిగిపోతున్నాయి. కానీ, పేరులో ‘అమీర్​’ ఉన్నా.. అభివృద్ధిలో మాత్రం గరీబ్​గానే మిగిలిపోయింది అమీర్​పేట్​ (Ameerpet)! ఇప్పటికీ అవే ఇరుకు గల్లీలు.. అవే పెచ్చులూడిన భవనాలు​.. అవే ట్రాఫిక్​ తిప్పలు..!! ఇటీవల జరిగిన అగ్నిప్రమాదమే అక్కడి దుస్థితికి సాక్ష్యం.

అమీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేట్​పై కలం 360 డిగ్రీస్ కథనం చదివేందుకు కింద ఉన్న పేపర్ ఇమేజ్ పై క్లిక్ చేయండి.

Read Also: ఇండియా ‘చిప్’ లు వాడండి : ప్రధాని నరేంద్ర మోడీ

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>