రాజేంద్రనగర్‌లో ఘోరం: యువకుడిని చంపి నిప్పు!

కలం, వెబ్​ డెస్క్​ : రాజేంద్రనగర్ (Rajendranagar) పరిధిలోని హిమాయత్ సాగర్ సమీపంలో ఒక యువకుడి మృతదేహం లభించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నిర్మానుష్య ప్రాంతంలో పడి ఉన్న మృతదేహాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు టోలిచౌకి ప్రాంతానికి చెందిన మహ్మద్ అమీర్‌గా పోలీసులు గుర్తించారు.

అయితే ఇది సాధారణ మరణం కాదని, ఎవరో కావాలనే అమీర్‌ను హత్య చేసి ఆధారాలు దొరకకుండా పెట్రోల్ పోసి తగులబెట్టారని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పాత కక్షల కారణంగా ఈ దారుణం జరిగిందా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Read Also: పేరుకే ‘అమీర్’పేట్.. నైన్టీస్ నాటి ఎమోషన్ ఇప్పుడిలా..

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>