Mobile Popup Ad
Mobile Popup Ad

కొత్త ఇన్నింగ్స్.. రెండో పెళ్లి చేసుకున్న శిఖర్ ధావన్

కలం, వెబ్ డెస్క్: టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ (Shikhar Dhawan)  తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాడు. శనివారం ఢిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతంలో ఐర్లాండ్‌కు చెందిన సోఫీ షైన్‌ను పెళ్లి చేసుకున్నాడు. సన్నిహితులు, కుటుంబసభ్యుల సమక్షంలో అత్యంత గోప్యంగా ఈ వివాహ వేడుక జరిగింది. టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ పెళ్లికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. నా మిత్రుడి పెళ్లి అంటూ క్యాప్షన్ ఇచ్చారు. తెల్లటి షేర్వాణీలో ధావన్, ఎరుపు-గోల్డ్ వర్క్ ఉన్న లెహంగాలో సోఫీ మెరిసిపోతున్న ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

కాగా శిఖర్ ధావన్ వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. ఆయన 2012లో ఆస్ట్రేలియాకు చెందిన అయేషా ముఖర్జీని వివాహం (Marriage) చేసుకున్నాడు. ఫేస్‌బుక్ ద్వారా మొదలైన వీరి పరిచయం ప్రేమగా మారి వివాహానికి దారితీసింది. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. అయితే, ఎనిమిదేళ్ల వైవాహిక బంధం తర్వాత వీరి మధ్య మనస్పర్థలు రావడంతో 2021లో విడిపోయారు. చివరకు 2023 అక్టోబర్‌లో ధావన్‌ విడాకులు తీసుకున్నాడు. విడాకుల అనంతరం తన కుమారుడిని కలవనివ్వకుండా భార్య అడ్డుకుంటుందని ధావన్ భావోద్వేగానికి లోనైన సందర్భాలున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>