కలం, వరంగల్ బ్యూరో : సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆదివారం వరంగల్ కు రానున్నారు. ఈ సందర్భంగా ములుగు జిల్లా కన్నాయిగూడెం దేవాదుల ప్రాజెక్ట్ పరిశీలిస్తారు. సీఎం పర్యటన సందర్భంగా శనివారం అదనపు కలెక్టర్ మహేందర్, జిల్లా ఇంచార్జ్ ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తో కలిసి ఏర్పాట్లు పరిశీలించారు. ప్రాజెక్ట్ ఆవరణలో అధికారుల సమావేశ ప్రాంతాన్ని, హెలిపాడ్, గోదావరి నది వ్యూ పాయింట్ ను పరిశీలించారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబధిత అధికారులను ఆదేశించారు.
Read Also: మునుగోడులో వివాదాస్పదంగా రాజగోపాల్ రెడ్డి రూల్స్
Follow Us On : WhatsApp


