Mobile Popup Ad
Mobile Popup Ad

టారిఫ్‌‌లపై మరో షాక్ ఇచ్చిన ట్రంప్..

కలం, డెస్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ లపై (Trump Tariffs) వెనక్కు తగ్గట్లేదు. ట్రంప్ ప్రపంచ దేశాలపై విధించిన టారిఫ్ లను అమెరికా సుప్రీంకోర్టు నిన్న కొట్టేసిన సంగతి తెలిసిందే. కానీ ట్రంప్ మాత్రం కోర్టు తీర్పును లెక్క చేయట్లేదు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులనే తప్పుబట్టాడు ట్రంప్. నిన్న 10 శాతం టారిఫ్‌ లు విధిస్తున్నట్టు ప్రకటించాడు. అక్కడితో ఆగకుండా.. తాజాగా 15 శాతానికి టారిఫ్‌ లను పెంచేశాడు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ టారిఫ్‌ ల (Trump Tariffs) టెన్షన్ మొదలైంది.

ట్రంప్ విధించిన టారిఫ్‌ లు చట్ట విరుద్ధం అని సుప్రీంకోర్టు నిన్న కొట్టేసింది. ఇప్పటి వరకు టారిఫ్ ల రూపంలో ఆయా దేశాల నుంచి వసూలు చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించాలంటూ ఆదేశించింది. కానీ ట్రంప్ మాత్రం కోర్టు ఆదేశాలను పట్టించుకోవట్లేదు. తన దగ్గర ప్లాన్-బి ఉందని నిన్ననే చెప్పిన ట్రంప్.. వరుస ప్రకటనలతో హడలెత్తిస్తున్నాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>