కలం/ఖమ్మం బ్యూరో : ఖమ్మం (Khammam) జిల్లా సత్తుపల్లి మండలం, గంగారం గ్రామంలోని పామాయిల్ తోటలో కోడి పందేలు నిర్వహిస్తున్న బెట్టింగ్ రాయుళ్లను పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు శనివారం తెల్లవారు జామున సీఐ శ్రీహరి, ఎస్ఐ అశోక్ కుమార్ లు తమ సిబ్బందితో కలిసి కోడి పందేలు నిర్వహిస్తున్న స్థావరంపై దాడి చేసి 14 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 65వేల నగదు, రెండు కోడి పుంజులు, రెండు కత్తులు, ఆరు బైకులు, పదకొండు కార్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ తెలిపారు.
Read Also: మునుగోడులో వివాదాస్పదంగా రాజగోపాల్ రెడ్డి రూల్స్
Follow Us On: Instagram


