epaper
Sunday, February 22, 2026
epaper

మా ఆఫీసులో మీటింగ్ పెడతావా.. మహిళా ఉద్యోగిపై రెచ్చిపోయిన నేత

కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం  జిల్లా ఎదులాపురం మున్సిపాలిటీలో (Yedulapuram) స్థానిక సీపీఐ నేత ఓ మహిళా అధికారిణిపై చేయి చేసుకున్న ఘటన చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళ్తే… ఇందిరమ్మ ఇండ్లు జియో ట్యాగింగ్ చేసే బొమ్మకంటి లావణ్య అనే అధికారిణి విధులు నిర్వహిస్తోంది. ఇందిరమ్మ ఇండ్ల విషయమై స్థానిక సీపీఐ ఆఫీసులో లబ్ధిదారులతో సమావేశం నిర్వహించింది. అదే సమయంలో అటుగా వచ్చిన సీపీఐ నాయకుడు, మాజీ సర్పంచ్ చెరుకుపల్లి భాస్కర్ ‘మా ఆఫీసులో మీటింగ్ ఎందుకు పెట్టావు’ అంటూ గొడవకు దిగాడు. అక్కడితో ఆగకుండా ఆమెపై చేయి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై అధికారిణి ఖమ్మం రూరల్ పోలీసులకు పిర్యాదు చేసింది. సీఐ ముష్కరాజ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తానని ఆయన చెప్పారు.

Read Also: పెళ్లిపై క్లారిటీ ఇచ్చేశారుగా.. ఒక్కటిగా కనిపించిన విజయ్, రష్మిక జంట

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>