epaper
Sunday, February 22, 2026
epaper

పెళ్లిపై క్లారిటీ ఇచ్చేశారుగా.. ఒక్కటిగా కనిపించిన విజయ్, రష్మిక జంట

కలం, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న (Vijay-Rashmika) ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు జోరందుకున్న విషయం తెలిసిందే. ఇటీవల వీరిద్దరూ హైదరాబాద్ విమానాశ్రయంలో కనిపించడంతో పెళ్లి పనులు మొదలయ్యాయని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. రహస్యంగా జరిగే ఈ వేడుక కోసం ఉదయపూర్ శివారులోని ‘ది మెమెంటోస్ బై ఐటీసీ హోటల్స్’ వేదిక కానుందని తెలుస్తోంది.

ప్రైవసీని కోరుకునే ఈ జంటలకు ఈ రిస్టార్ సరైన ఎంపిక. అందుకే విజయ్-రష్మిక (Vijay-Rashmika) ఈ ప్లేస్‌ను సెలక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వివాహ వేడుకలకు గెస్టులు ఫిబ్రవరి 23 నుంచే చేరుకుంటారని, 24, 25 తేదీల్లో ప్రీ-వెడ్డింగ్ వేడుకలు (హల్దీ, మెహందీ) జరుగుతాయని సమాచారం. ‘ది మెమెంటోస్’ రిసార్ట్ 117 విల్లాలుంటాయి. ఇక్కడ్నుంచి అద్భుతమైన ప్రకృతి దృశ్యాలను అస్వాదించవచ్చు.

ఈ హోటల్‌లో హెలిప్యాడ్ సౌకర్యం ఉండటంతో, అతిథుల కోసం హెలికాప్టర్ సర్వీసులు వినియోగించే అవకాశం ఉంది. ఈ జంట గతేడాది అక్టోబర్ 3న కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారని సమాచారం. అప్పట్లో రష్మిక షేర్ చేసిన ఫోటోలు, ఆమె వేలికి ఉన్న ఉంగరం పెళ్లి వార్తలకు మరింత బలాన్నిచ్చాయి.

Read Also: ఫోన్‌పేలో కొత్త ఏఐ ఫీచర్.. ఇక వాయిస్‌తోనే చెల్లింపులు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>