epaper
Sunday, February 22, 2026
epaper

నిండు ప్రాణం తీసిన వివాహేతర సంబంధం

కలం, ఖమ్మం బ్యూరో : వివాహేతర సంబంధం (Extramarital Relationship) నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న ఘటన భద్రాచలంలో కలకలం రేపింది. భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలోని లక్ష్మీదేవిపల్లి మండలానికి చెందిన జీ.రమేష్, సుమలత దంపతులకు ముగ్గురు పిల్లలు. పదిహేనేళ్ల క్రితం సుమలతను వివాహం చేసుకున్న రమేష్, కొంత కాలంగా సుశీల అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. సుశీలను భద్రాచలం (Bhadrachalam) జగదీష్ కాలనీలో అద్దె ఇంట్లో ఉంచాడు. ఈ వివాహేతర సంబంధం విషయం తెలుసుకున్న భార్య, రమేష్‌తో గొడవ పెట్టుకోగా, ఇక మీదట బుద్దిగా ఉంటానని మాట ఇచ్చాడు. కానీ దానికి విరుద్ధంగా గుట్టుగా ఆ సంబంధాన్ని కొనసాగించాడు.

రెండు రోజుల క్రితం లక్ష్మీదేవిపల్లిలో (Lakshmidevi Palli) ఉంటున్న భార్య దగ్గరికి వెళ్ళి వచ్చిన అనంతరం, ఈ సంబంధం వ్యవహారం మళ్ళీ బయట పడి గొడవలు అవుతాయనే భయంతో డోర్ లాక్ చేసుకుని చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకున్నట్లు తెలుస్తోంది. ఇది గమనించిన సుశీల చుట్టు పక్కల వారి సహాయంతో కిందికి దించగా అప్పటికే రమేష్ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న రమేష్ భార్య సుమలత పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

 Read Also: AI సమ్మిట్‌లో కాంగ్రెస్ ఆందోళన: కేటీఆర్ రియాక్షన్​ ఇదే

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>