epaper
Sunday, February 22, 2026
epaper

‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ గ్రాండ్ లాంచ్.. వేదిక ఎక్కడంటే?

కలం, సినిమా : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan), స్టార్ డైరెక్టర్ హరీశ్ శంకర్ (Harish Shankar) కాంబినేషన్‌లో వస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ “ఉస్తాద్ భగత్ సింగ్” (Ustaad Bhagat Singh). మైత్రి మూవీస్ నిర్మాణంలో వస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ మార్చి 26, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత మరోసారి ఈ క్రేజీ కాంబో నుంచి సినిమా వస్తుండటంతో ఉస్తాద్ భగత్ సింగ్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఈ సినిమాలో (Ustaad Bhagat Singh) పవన్ కల్యాణ్ సరసన శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటిస్తుండగా.. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ సింగల్ ట్రెండింగ్ కాగా.. తాజాగా ‘ఆరా ఆఫ్ ఉస్తాద్'(Aura Of Ustaad) అంటూ సెకండ్ సింగల్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఫుల్ సాంగ్‌ను రేపు మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ వేదికగా గ్రాండ్ లాంచ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సాంగ్‌లో వచ్చే పవన్ కల్యాణ్ మేనరిజం గురించి రేపు ఈవెంట్‌లో స్పెషల్‌గా మాట్లాడుకుందామని  హరీశ్ శంకర్ తెలిపారు.

 Read Also: ఇలాగైతే అధికారంలోకి రాలేం? ప్రధాన పార్టీ పోస్టుమార్టం

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>