epaper
Sunday, February 22, 2026
epaper

బాబర్ అజామ్ డిమోషన్‌కు కారణం చెప్పిన హెస్సన్

కలం, స్పోర్ట్స్​ : టీ20 వరల్డ్ కప్‌లో బాబర్ అజామ్‌కు డిమోషన్ అనుభవం ఎదురైంది. అతడు బ్యాటింగ్‌కు దిగే వరుస క్రమం మరింత వెనక్కి జరిగింది. సాధారణంగా మూడో లేదా నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే బాబర్.. నమీబియాతో పోరులో 5వ నెంబర్‌లో కూడా క్రీజ్‌లోకి అడుగు పెట్టలేదు. ఇది పెద్ద చర్చకు దారితీసింది. ఈ డిమోషన్‌కు గల కారణాన్ని పాక్ హెడ్ కోచ్ మైక్ హెస్సన్ (Mike Hesson) వివరించారు. పవర్‌ప్లేలో తక్కువ స్ట్రైక్ రేట్ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. నమీబియా మ్యాచ్ ముగిసిన తర్వాత, న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడిన హెస్సన్ ఈ విషయాలను పంచుకున్నారు.

వరల్డ్ కప్‌లో పవర్‌ప్లేలో బాబర్ స్ట్రైక్ రేట్ 100 కంటే తక్కువగా ఉందని, ఆ సమయంలో జట్టుకు మరింత వేగంగా ఆడే ఆటగాడు అవసరమని బాబర్‌కు కూడా తెలుసని ఆయన పేర్కొన్నారు. ఆసియా కప్ తర్వాత బాబర్‌ను ఒక ప్రత్యేక పాత్ర కోసం జట్టులోకి తీసుకున్నట్లు హెస్సన్ వివరించారు. ఆ బాధ్యతను చివరి ఓవర్లలో ఇతర ఆటగాళ్లు మరింత సమర్థంగా నిర్వహించగలరని బాబర్ కూడా అంగీకరించినట్లు ఆయన తెలిపారు. అదే సమయంలో, పేసర్ సల్మాన్ మిర్జా ప్రదర్శనపై కూడా హెస్సన్ స్పందించారు.

షాహీన్ స్థానంలో అతడిని తీసుకున్నప్పుడు మంచి బౌలింగ్ చేశాడని, భారత్‌తో మ్యాచ్‌తో పాటు మరికొన్ని మ్యాచ్‌ల్లో అవకాశం రాకపోవడం అతడి దురదృష్టకరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక న్యూజిలాండ్ జట్టు ఉపఖండ పరిస్థితులకు బాగా అలవాటు పడిందని, కాబట్టి ఆ జట్టుపై గెలవాలంటే పాకిస్థాన్ తమ అత్యుత్తమ ప్రదర్శన చేయాల్సి ఉంటుందని హెస్సన్ (Mike Hesson)పేర్కొన్నారు. జట్టు అవసరాలకు అనుగుణంగానే బ్యాటింగ్ క్రమంలో మార్పులు చేసినట్లు పాకిస్థాన్ జట్టు యాజమాన్యం స్పష్టం చేసింది.

 Read Also: మాజీ ఎంపీ కి బిగ్ షాక్: వేలానికి ఆస్తులు

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>