epaper
Sunday, February 22, 2026
epaper

మరో టీమిండియా క్రికెటర్​ విడాకులు

కలం, వెబ్​ డెస్క్​: టీమిండియా మాజీ, ప్రస్తుత క్రికెటర్ల విడాకుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే హార్థిక్​ పాండ్యా, మహ్మద్​ షమీ, శిఖర్​ ధావన్​ విడాకులు తీసుకోగా.. ఇప్పుడు ఈ జాబితాలోకి స్పిన్నర్​ రాహుల్​ చాహర్ (Rahul Chahar)​ చేరాడు. భార్య ఇషానీ జోహర్​తో విడిపోనున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు ఇన్​స్టాగ్రామ్ ఖాతాలోశుక్రవారం స్వయంగా వెల్లడించాడు.

రాహుల్​కు 22 ఏళ్ల వయసులో 2022 మార్చి 9న ఇషానీతో వివాహమైంది. వీళ్ల పెళ్లి జరిగి వచ్చే నెలకు నాలుగో వార్షికోత్సవం కానుంది. ఈ సమయంలో హఠాత్తుగా విడాకుల విషయం వెల్లడించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. గత 15 నెలలుగా తన దాంపత్య జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు, కష్టాలు ఎదుర్కొన్నట్లు రాహుల్​ పేర్కొన్నాడు.

టీమిండియా తరఫున 2021లో చివరిసారి కనిపించిన రాహుల్(Rahul Chahar)​ ఆ తర్వాత తిరిగి చోటు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. రాబోయే ఐపీఎల్​లో సీఎస్​కే తరఫున ఆడనున్నాడు. అంతకుముందు సీజన్​లో ఎస్​ఆర్​హెచ్​ టీమ్ తరఫున ఆడాడు

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>