Mobile Popup Ad
Mobile Popup Ad

వైభవంగా సత్యనారాయణ స్వామి కల్యాణం

కలం, నిజామాబాద్ బ్యూరో : కామారెడ్డిలోని (Kamareddy) సత్యనారాయణ స్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్వామి వారి కళ్యాణం కనుల పండువగా జరిగింది. ఈ మహోత్సవంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. వార్షికోత్సవ వేడుకలు మూడు రోజులపాటు జరుగుతున్నాయి. వేద పండితుల ఆధ్వర్యంలో భక్తులు శాంతి హోమాలు, ప్రత్యేక యజ్ఞాలు నిర్వహిస్తున్నారు. శ్రీ సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారి కళ్యాణం తిలకించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>