కలం, నిజామాబాద్ బ్యూరో : మార్కులు, ర్యాంకుల కోసం మాస్ కాపీయింగ్ కు పాల్పడడానికి ప్రైవేట్ కాలేజీలు కొన్ని ఎగ్జామ్ సెంటర్స్ తో కుమ్మక్కవుతున్నాయని పిడీఎస్ యూ ఆరోపించింది. నిజమాబాద్ (Nizamabad) జిల్లాలో మాస్ కాపీయింగ్ జరగకుండా చూడాలని పీడిఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు.. నిజామాబాద్ జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయం ముందు పిడిఎస్ యూ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. అనంతరం కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చారు. ఫీజుల కోసం విద్యార్థులను ఇబ్బంది పెడుతున్న ప్రైవేట్ కళాశాలలపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా రాజేశ్వర్ మాట్లాడుతూ పేరు మోసిన ప్రైవేట్ కాలేజీలు మాస్ కాపీయింగ్ చేయించేందుకు ఎగ్జామ్ సెంటర్లతో కుమ్మక్కవుతున్నాయని ఆరోపించారు. దీని వల్ల ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివే పేద స్టూడెంట్లకు ప్రతి ఏటా అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి జిల్లాలో మాస్ కాపీయింగ్ జరగకుండా చూడాలనీ కోరారు. ఫీజులు పూర్తిగా కట్టలేదని చాలా మంది స్టూడెంట్లకు హాల్ టికెట్స్ ఇవ్వకుండా ఎగ్జామ్స్ టైమ్ లో ఇబ్బంది పెడుతున్నారని.. ప్రైవేట్ యాజమాన్యాలపైన కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. పిడిఎస్ యూ నిజామాబాద్ నగర అధ్యక్ష, కార్యదర్శులు సిర్రం పవన్ కుమార్, డి.సాయి కిరణ్, నగర ఉపాధ్యక్షులు మనోజ్, నాయకులు దత్తాత్రి, సాయి చరణ్, తేజ, మహేష్, ప్రేమ్ కుమార్, భజరంగ్, చరణ్, రూపేష్ తదితరులు పాల్గొన్నారు.


