epaper
Sunday, February 22, 2026
epaper

‘ఏఐ’లో వారసుల పోరు.. వేల కోట్ల పెట్టుబడులు

కలం, తెలంగాణ బ్యూరో: ప్రపంచం నలుమూలల నుంచి దిగ్గజ టెక్ కంపెనీలు ఢిల్లీ బాట పట్టాయి. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ (AI Impact Summit) ఇందుకు వేదికైంది. మైక్రోసాఫ్ట్, గూగుల్… సహా అనేక కంపెనీలు ఏఐ (Artificial Technology) టెక్నాలజీ అభివృద్ధి, పరిశోధన కేంద్రాల ఏర్పాటుకు భారత్‌లో పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించాయి. దేశంలో అత్యంత సంపన్నులైన గౌతమ్ అదానీ (Adani), ముఖేశ్ అంబానీల (Ambani) కంపెనీలు తగ్గేదేలే అనే తీరులో వేల కోట్ల డాలర్ల పెట్టుబడులకు గ్రౌండ్ సిద్ధం చేసుకున్నారు. ఆ రెండు కుటుంబాల వ్యాపార వారసులుగా జీత్ అదానీ (Jeet Adani), ఆకాశ్ అంబానీ (Akash Ambani) సమ్మిట్ వేదికగా వేర్వేరు పెవిలియన్‌లు పెట్టుకున్నారు. వ్యాపార విస్తరణకు ఏఐ టెక్నాలజీని ఎలా వాడుకోనున్నారో వివరించారు. ఏయే రంగాల్లోకి ఎంటర్ కానున్నదీ వివరించారు. బహుళజాతి సంస్థల సాంకేతిక సహకారాన్ని ఇందుకు వాడుకోదల్చుకున్నారు.

ఏఐ టెక్నాలజీ సామ్రాజ్యంలోకి జీత్ అదానీ :

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఆధారిత పరిశ్రమలకు గౌతమ్ అదానీ వారసుడిగా జీత్ అదానీ శ్రీకారం చుడుతున్నారు. ఏఐ ఆధారిత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్లాట్‌ఫామ్‌ను నిర్మించాలనుకుంటున్నారు. ఇందుకు గ్రీన్ ఎనర్జీని వినియోగించనున్నట్లు బహుళజాతి సంస్థలకు వివరించారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో ఇప్పటికే ఆయన తండ్రి గౌతమ్ అదానీ ఎంట్రీ అయ్యారు. ఇప్పుడు జీత్ అదానీ ఏఐ సామ్రాజ్యాన్ని నిర్మించదల్చుకున్నారు. ఇందుకోసం తండ్రి కంపెనీలు ఉత్పత్తి చేసే గ్రీన్ ఎనర్జీని వాడనున్నారు. ఏఐ టెక్నాలజీ ద్వారా దేశంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. సుమారు వంద బిలియన్ డాలర్ల (రూ. 9 లక్షల కోట్లు) మేర పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించారు. ఏఐ టెక్నాలజీకి ఉన్న అవకాశాలు, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కంప్యూటింగ్, క్లౌడ్ సర్వీసెస్, డాటా సెంటర్స్, సేవల రంగంలో కొత్త యూనిట్లను నెలకొల్పనున్నట్లు ప్రకటించారు.

జియో టాగ్‌లైన్‌తో ‘ఏఐ ఫర్ ఆల్’ :

ఇప్పటికే జియో టెలికామ్ రంగంతో మొదలుపెట్టి వివిధ రంగాలకు విస్తరించిన అంబానీ బిజినెస్ ఇప్పుడు ఏఐ టెక్నాలజీలోకి కూడా ఎంటర్ అవుతున్నది. ముఖేశ్ అంబానీ కుమారుడు ఆకాశ్ అంబానీ ఆధ్వర్యంలో ‘ఏఐ ఫర్ ఆల్’ పేరుతో జియో టాగ్‌లైన్ ద్వారా వివిధ రకాల సర్వీసుల్లోకి ప్రవేశిస్తున్నారు. ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, కల్చర్, స్మార్ట్ హోమ్స్, ఎంటర్‌ప్రైజ్ ఇంటెలిజెన్స్ తదితర రంగాల్లో ఏఐ టెక్నాలజీని వాడి బిజినెస్‌ను విస్తరించాలనుకుంటున్నారు. జియో ఏఐ స్టాక్, జియో సంస్కృతి ఏఐ, జియో ఆరోగ్య ఏఐ, జియో శిక్షా, జియో ఏఐ హోమ్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా స్మార్ట్ లివింగ్ సౌకర్యాన్ని తేనున్నట్లు ప్రకటించారు. అన్ని సెక్షన్ల ప్రజలకు ఏఐ టెక్నాలజీ ద్వారా జియో నుంచి సేవలందించేలా భారీ స్థాయిలోనే పెట్టుబడి పెట్టనున్నట్లు ఢిల్లీలోని ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ వేదికగా అనౌన్స్ చేశారు.

సంపన్న కుటుంబాల ఏఐ బిజినెస్ వార్ :

ఏఐ టెక్నాలజీ వివిధ దేశాల, బహుళజాతి సంస్థల, టెక్ కంపెనీల మధ్య పోటీని ఉధృతం చేసింది. అన్ని రకాల అవసరాల్లోకి ఏఐ జొరబడుతున్నది. ప్రత్యేకంగా మంత్రిత్వశాఖను పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఫ్యూచర్ సిటీలో ఏఐ సిటీని నెలకొల్పనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ప్రధాని సైతం ఏఐ టెక్నాలజీ డెవలప్‌మెంట్, వినియోగంలో ఇతర దేశాలతో భారత్ ఎక్కడా వెనకబడొద్దనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. ఏఐ వినియోగంలో భారత్‌లో ఉన్న అవకాశాలను వ్యాపారాన్ని పెంచుకోడానికి, సంపదను పోగేసుకోడానికి బహుళజాతి సంస్థలు సైతం పోటీ పడుతున్నాయి. ఇలాంటి తరుణంలో దేశంలోనే టాప్ టెన్ సంపన్నులైన అదానీ, అంబానీ వారసులు ఇప్పుడు ఏఐ ఆధారిత వ్యాపారంలోకి ఎంటర్ అవుతున్నారు. ఈ రెండు ఫ్యామిలీల, కంపెనీల మధ్య ‘బిజినెస్ వార్’ మొదలైంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>