epaper
Monday, February 23, 2026
epaper

కర్రెగుట్టల్లో ల్యాండ్ మైన్ పేలి జవాన్‌కు తీవ్ర గాయాలు

కలం, వెబ్ డెస్క్: ఛత్తీస్‌గఢ్‌లోని కర్రెగుట్టల (Karregutta) అడవుల్లో మావోయిస్టులు అమర్చిన ల్యాండ్ మైన్ పేలడంతో ఓ జవాన్ తీవ్రంగా గాయపడ్డారు. జెల్ల-పామునూరు మార్గంలో భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 39వ బెటాలియన్‌కు చెందిన జవాన్ రాజన్ ఈ పేలుడులో తీవ్రంగా గాయపడ్డాడు. అధికారులు వెంటనే ఆయనను మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కాగా, అదే ప్రాంతంలో బాంబు డిస్పోజల్ స్క్వాడ్ (BDS) బృందాలు శుక్రవారం ఉదయం నుంచి తనిఖీలు చేపట్టి, మావోయిస్టులు అమర్చిన 11 ఐఈడీ (IED)లను గుర్తించి నిర్వీర్యం చేశాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>