epaper
Sunday, February 22, 2026
epaper

సూపర్-8లోనే అసలు పరీక్ష.. టీమిండియాకు సెహ్వాగ్ హెచ్చరిక

కలం, వెబ్ డెస్క్: టీమిండియాకు వరల్డ్ కప్‌లో అసలు పరీక్ష సూపర్-8లో ఉండనుందని ఇండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag)  అన్నారు. సూపర్-8లోకి అడుగు పెడుతూనే భారత్ ముందు చాలా ఛాలెంజ్‌లు ఉంటాయని అన్నారు. గ్రూప్ దశలో పరాజయం ఎరుగని టీమ్‌గా భారత్ నిలిచినా, టీమ్ బౌలింగ్‌పై అనేక సందేహాలు ఉన్నాయని సెహ్వాగ్ భావిస్తున్నారు. సెహ్వాగ్ ఒక్కరనే కాదు ఇతర విశ్లేషకులది కూడా అదే మాట. వరల్డ్ కప్‌లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 17 పరుగుల తేడాతో గెలిచింది. భారత్ ఇన్నింగ్స్‌లో శివమ్ దూబే 66 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడగా, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 34 పరుగులు జోడించాడు. నెదర్లాండ్స్ బౌలర్లలో లోగన్ వాన్ బీక్ 3 వికెట్లు తీశాడు. లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన నెదర్లాండ్స్ జట్టులో బాస్ డి లీడే 33 పరుగులు చేశాడు.

భారత్ బౌలర్లలో వరుణ్ చక్రవార్తి 3 వికెట్లతో మెరిశాడు. డుబే 2 వికెట్లు కూడా తీసుకున్నాడు. ఈ క్రమంలో భారత్ పర్ఫారెన్స్‌పై సెహ్వాగ్ (Virender Sehwag) తన అభిప్రాయం షేర్ చేసుకున్నారు. ఆయన ప్రకారం ఇప్పటి వరకు టీమిండియా పెద్ద ఛాలెంజ్‌ను కానీ, పరీక్షకు గురికాలేదని అన్నారు. కానీ సూపర్-8లో పరిస్థితులు వేరేలా ఉంటాయని, సూపర్-8లో బలమైన జట్లను ఎదుర్కొన్నప్పుడు భారత్ బౌలింగ్ ఎలా ఉంటుందో చూడాలని అన్నారు. టోర్నీలో రాణించాలంటే భారత్ తన బౌలింగ్‌కు పదును పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని సెహ్వాగ్ అభిప్రాయపడ్డారు. మంచి బ్యాటింగ్ లైనప్ ఉన్న టీమ్‌తో తలపడితే భారత్ బౌలింగ్‌ ఎంత వరకు పనికొస్తుంది? బౌలింగ్‌ను ఎలా వినియోగించుకుంటారు? అనేది చూడాల్సిన అవసరం ఉందని అన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>