Mobile Popup Ad
Mobile Popup Ad

అమీర్‌పేట్ మైత్రివనంలో అగ్నిప్రమాదం

కలం, వెబ్​ డెస్క్​ : హైదరాబాద్ లోని అమీర్‌పేట్ మైత్రివనం (Maitrivanam) వద్ద అగ్ని ప్రమాదం సంభవించింది. అక్కడి నీలగిరి బ్లాక్ భవనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఈ భవనం నాలుగో అంతస్తులో ఉన్న ఒక కోచింగ్ ఇనిస్టిట్యూట్‌లో మంటలు వ్యాపించడంతో లోపల ఉన్న విద్యార్థులు బయటకు రాలేక అక్కడే చిక్కుకుపోయారు. ప్రాణాలను కాపాడుకోవడానికి విద్యార్థులు భవనం బాల్కనీల వద్దకు చేరుకుని సాయం కోసం చూస్తున్నారు. బాల్కానీ నుంచి విద్యార్థులను పోలీసులు, స్థానికులు కిందకు దించే ప్రయత్నం చేస్తున్నారు.

మైత్రివనం (Maitrivanam) ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. భవనంలో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి చర్యలు చేపట్టారు. అయితే లోపల దట్టమైన పొగ వ్యాపించడంతో భయంతో కొంతమంది విద్యార్థులు బాల్కనీ నుండి కిందకు దూకే ప్రయత్నం చేస్తున్నారు. ఘటనా స్థలంలో జనం భారీగా గుమిగూడటంతో అమీర్‌పేట్ ప్రాంతంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>