కలం, వెబ్ డెస్క్: భారత ఐటీ ఉద్యోగులే లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎనిమిది టెక్ కంపెనీలను పెర్మ్ గ్రీన్ కార్డు ప్రోగ్రాం నుంచి తొలగించారు. ఈ కంపెనీల్లో హెచ్–1బి వీసాల ద్వారా ఉద్యోగాల్లో చేరినవారు ఇక నుంచి అమెరికాలో శాశ్వతంగా నివాసం ఉండే గ్రీన్ కార్డు పొందడానికి అనర్హులు. అమెరికన్ ఉద్యోగులను తొలగించి.. వారి స్థానంలో హెచ్–1బి వీసాలతో విదేశీ ఉద్యోగులను నియమించేందుకు పెర్మ్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలపై ఈ చర్య తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ నిర్ణయంతో కొత్త పెర్మ్ దరఖాస్తులు నిలిచిపోవడంతో పాటు ఇప్పటికే పెండింగులో ఉన్న వాటిపై కూడా ప్రభావం పడబోతుంది.
ఇవే ఆ కంపెనీలు..
పెర్మ్ గ్రీన్ కార్డు ప్రోగ్రాం నుంచి 8 భారత కంపెనీలను తొలగించారు. కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, హెచ్సీఎల్, క్యాప్ జెమిని, మైక్రోసాఫ్ట్, అడోబ్ కంపెనీలున్నాయి. ఈ సంస్థల్లో పనిచేస్తున్న భారతీయ ఐటీ ఉద్యోగులకు ఇక గ్రీన్ కార్డు వచ్చే పరిస్థితి దాదాపుగా లేనట్లేనని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీనిపై భారత ప్రభుత్వం ఇంకా స్పందించలేదు.

