కలం, వెబ్ డెస్క్: టీ20 వరల్డ్ కప్‌లో భారత్ (Team India) ఓటమెరుగని జట్టుగా ముందుకు సాగుతోంది. కానీ, కొన్ని లోపాలు మాత్రం వెంటాడుతున్నాయి. అందులో ఒకటి ఆటగాళ్లను భయపెడుతోంది. అదే ఆఫ్ స్పిన్. టీమిండియాకు ఇప్పుడు ఆఫ్ స్పిన్ అతిపెద్ద సమస్యగా మారింది. లీగ్ దశలో జరిగిన మ్యాచ్‌ల్లో ఆఫ్ స్పిన్ ఆడడంలో భారత బ్యాటర్లు తడబడ్డారు. దీంతో ఇప్పుడు మన బ్యాటర్లకు ‘ఆఫ్ స్పిన్’ అంటే వణుకు పుడుతోంది. ముఖ్యంగా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లను టార్గెట్ చేస్తూ ప్రత్యర్థులు వేస్తున్న ప్లాన్ సక్సెస్ అవుతోంది. భారత టాప్ ఆర్డర్లో ఆరుగురు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు ఉండటం ప్రత్యర్థులకు ప్లస్ పాయింట్ అవుతోంది.
ఈ టోర్నీలో ఆఫ్ స్పిన్నర్ల బౌలింగ్‌లో భారత్ (Team India) రన్ రేట్ చాలా తక్కువగా (6.23) ఉంది. మిగతా జట్లన్నీ 8 రన్ రేట్‌తో ఆడుతుంటే, మన టీమ్ నెమ్మదిగా ఆడుతోంది. ఆఫ్ స్పిన్ బౌలింగ్‌లో భారత్ ఏకంగా 11 వికెట్లు కోల్పోయింది. సగటున ప్రతి 13 పరుగులకు ఒక వికెట్ ఇచ్చింది. అభిషేక్ శర్మ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో డకౌట్ అయ్యాడు. అందులో రెండు సార్లు ఆఫ్ స్పిన్నర్లకే వికెట్ ఇచ్చాడు. అలాగే తిలక్ వర్మ, సూర్యకుమార్ కూడా ఆఫ్ స్పిన్‌కు తడబడ్డారు. దీంతో సూపర్-8లో ఆఫ్ స్పిన్ ముప్పు పొంచి ఉంది.
వచ్చే ఆదివారం నుంచి మొదలయ్యే సూపర్-8లో గట్టి పోటీ ఎదురుకానుంది. దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్‌లో మార్క్రమ్ రూపంలో ఆఫ్ స్పిన్నర్ ఉన్నాడు. అలాగే జింబాబ్వేలో సికిందర్ రజా తన స్పిన్‌తో ముప్పుతిప్పలు పెట్టగలడు. వెస్టిండీస్‌లో రోస్టన్ ఛేజ్ పవర్‌ప్లేలోనే బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. ఆఫ్ స్పిన్ వీక్నెస్ను కవర్ చేయడానికి సూర్యకుమార్, తిలక్ వర్మల బ్యాటింగ్ ఆర్డర్ మార్చే ఆలోచనలో టీమ్ మేనేజ్మెంట్ ఉంది. ప్రాక్టీస్ సెషన్స్‌లో కూడా ఆఫ్ స్పిన్‌పైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. మరి ఈ ‘ఆఫ్ స్పిన్’ గండం నుంచి మనవాళ్లు ఎలా బయటపడతారో చూడాలి!
Read Also: స్పిన్‌పై ఆటకు పదును పెట్టాలి: టీమిండియా కోచ్
Follow Us On: Instagram


