epaper
Monday, February 23, 2026
epaper

‘సర్​’కు సిద్ధంగా ఉండండి.. తెలుగు రాష్ట్రాలకు ఈసీ లేఖ

కలం, వెబ్​ డెస్క్​: ఆంధ్రప్రదేశ్​, తెలంగాణతోపాటు మరో 20 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు గురువారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది (EC – SIR). ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్​) చేపట్టడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని కోరింది. ఎస్​ఐఆర్​ (SIR) ప్రక్రియ రాబోయే ఏప్రిల్​లో నిర్వహించే అవకాశమున్నందున సాధ్యమైనంత త్వరగా సన్నాహక ఏర్పాట్లు పూర్తి చేయాలని చెప్పింది.

ఈ మేరకు తెలుగు రాష్ట్రాలతోపాటు అరుణాచల్​ ప్రదేశ్​, హిమాచల్​ ప్రదేశ్​, జమ్మూ కాశ్మీర్​, జార్ఖండ్​, కర్ణాటక, మహారాష్ట్ర, మణిపూర్​, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్​, ఢిల్లీ, ఒడిశా, పంజాబ్​, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్​, కేంద్ర పాలిత ప్రాంతాల ఎన్నికల ప్రధానాధికారులకు పంపిన లేఖలో పేర్కొంది.

కాగా, కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే 12 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో ‘సర్​’ ప్రక్రియ చేపట్టింది (EC – SIR). వీటిలో ఇప్పటికే బిహార్​లో పూర్తి కాగా, మరో 9 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇంకా కొనసాగుతోంది. అలాగే అసోంలో ‘సర్’​కు బదులు స్పెషల్​ రివిజన్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు ‘సర్​’ కు సిద్ధంగా ఉండాలంటూ సీఈసీ ఆదేశాలు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>