కలం, నల్లగొండ బ్యూరో : మునుగోడు(Munugode) నియోజకవర్గంలో సాయంత్రం 6 గంటలలోపు వైన్ షాపుల పర్మిట్ రూములకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఇచ్చేదీ లేదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Raj Gopal Reddy) మరోసారి స్పష్టం చేశారు. మునుగోడులో గురువారం వైన్ షాపుల సమయపాలన నిర్వహణ తీరును ఆయన పరిశీలించారు. మునుగోడు నియోజకవర్గ కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులో వైన్ షాప్ వద్ద ఆగి పరిసరాలను పరిశీలించారు. సాయంత్రం 6 గంటల వరకు పర్మిట్ రూమ్‌లో గాని, చుట్టు పరిసరాల ప్రాంతాల్లో ఎవ్వరు కూడా మందు తాగొద్దని వైన్ షాప్ నిర్వాహకులకు మరో మారు గట్టిగా చెప్పారు. వైన్ షాపుల సమయపాలన నిర్వహణను పకడ్బందీగా అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు.
Read Also: సీఎం రేవంత్ కు కేటీఆర్ బహిరంగ లేఖ : అందులో ఏముంది?
Follow Us On: Instagram


