epaper
Monday, February 23, 2026
epaper

స్టార్ యాక్టర్‌కు షాక్ ఇచ్చిన అనిల్ రావిపూడి..?

కలం, డెస్క్ : వరుస హిట్లతో జోరుమీదున్నాడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). ఈ సంక్రాంతికి చిరంజీవితో తీసిన మన శంకర వర ప్రసాద్ గారు మూవీ రిలీజ్ అయి మంచి హిట్ అయింది. దీంతో తన తర్వాత మూవీపై ఫోకస్ చేస్తున్నాడు అనిల్. విక్టరీ వెంకటేశ్ తో అనిల్ మరో మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బావమరిది పాత్ర కోసం ఎప్పటి నుంచో సెర్చ్ చేస్తున్నాడు అనిల్ రావిపూడి. ముందుగా ఫహాద్ ఫాజిల్ పేరు వినిపించింది. ఆయనకు కూడా కథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంట. కానీ పుష్ప సిరీస్ తో ఫహాద్ కు నేషనల్ వైడ్ క్రేజ్ వచ్చింది. అందుకే ఫహాద్ ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం.

రూ.10 కోట్ల వరకు వెంకటేశ్ మూవీ కోసం ఫహాద్ అడగడంతో.. బడ్జెట్ పరంగా కుదరకపోవడంతో సున్నితంగా నో చెప్పేశాడంట అనిల్ రావిపూడి. ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్ లో ఇదే హాట్ టాపిక్ అవుతోంది. ఫహాద్ ప్లేస్ లో తమిళ హీరో కార్తీని (Karthi) అడుగుతున్నట్టు తెలుస్తోంది. కార్తీకి కూడా తెలుగు నాట మంచి క్రేజ్ ఉంది. గతంలో నాగార్జునతో కలిసి ఊపిరి సినిమాలో నటించాడు. వెంకటేశ్-అనిల్ మూవీలో బావమరిది పాత్రకు మంచి స్కోప్ ఉంటుందంట.

అలాంటి పాత్రలో స్టార్ యాక్టర్ అయితేనే బాగుంటుందని అనిల్ (Anil Ravipudi) భావించి.. కార్తీతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వెంకటేశ్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ మూవీ అయిపోయిన తర్వాత అనిల్ తో షూట్ స్టార్ట్ చేస్తాడా.. లేదంటే మధ్యలోనే వెంకీ జాయిన్ అవుతాడా అనేది తెలియాల్సి ఉంది.

Read Also: ఆ హీరోను చూసి నా బాయ్ ఫ్రెండ్ టెన్షన్ పడ్డాడు : మృణాల్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>