epaper
Sunday, February 22, 2026
epaper

విశాఖలో దారుణం.. మూడేళ్ల చిన్నారిపై అత్యాచార యత్నం

కలం, వెబ్​డెస్క్​ : మదనపల్లిలో జరిగిన దారుణ ఘటన మరవకముందే విశాఖపట్నం (Visakhapatnam)లో మరో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. న్యూ పోర్ట్ కాలనీలో నివసించే మూడేళ్ల పసికందుపై యోగి అనే వ్యక్తి కిరాతకానికి ఒడిగట్టాడు. బిస్కెట్లు కొనిపెడతానంటూ ఆ చిన్నారికి మాయమాటలు చెప్పి ఏమార్చిన నిందితుడు, నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు.

ఈ దారుణ విషయం గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>