కలం, వెబ్ డెస్క్: తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్ట (Karregutta)లో మరోసారి తుపాకీల మోత మోగింది. భద్రతా బలగాలు ఇక్కడ భారీ ఎన్‌కౌంటర్ (Encounter) నిర్వహించాయి. ఈ ఎన్ కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో మావోయిస్ట్ అగ్రనేతలు కూడా ఉన్నారని సమాచారం. ఆపరేషన్ 2 కగార్ (Operation 2 Kagar) పేరుతో కేంద్రరాష్ట్ర బలగాల భారీ కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. మావోయిస్ట్ అగ్ర నేతలే టార్గెట్‌గా ఆపరేషన్ 2 కగార్ చేపట్టారు.
మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని ఇంతకు ముందే కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంకా నలబై రోజులే మిగిలి ఉన్నందున ఆపరేషన్ కగార్ వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. దాదాపు 5 వేల మంది సీఆర్పీఎఫ్ జవాన్లతో కర్రె గుట్టలో (Karregutta Encounter) భారీ ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నారు.
Read Also: వచ్చే ఎన్నికలే లక్ష్యం: కొత్త పార్టీపై కవిత కీలక ప్రకటన
Follow Us On: Pinterest


