epaper
Monday, March 2, 2026
epaper

హోరాహరీగా సాగిన ప్రీవెడ్డింగ్ క్రికెట్.. మందనాదే విజయం..

భారత మహిళా క్రికెటర్ స్మృతి మందానా(Smriti Mandhana), ఆమె ప్రియుడు పలాష్ ముచ్ఛల్(Palash Muchhal) మూడుముళ్ల బంధంలోకి అడుగు పెట్టనున్నారు. ఈ క్రమంలోనే వారి పెళ్లి సందడి దేశమంతా జోరుగా వినిపిస్తోంది. అయితే పెళ్ళి పనుల్లో భాగంగా.. వాళ్లు కూడా ప్రీ వెడ్డింగ్ ఈవెంట్స్‌ను గ్రాండ్‌గా ప్లాన్ చేసుకున్నారు. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. అందరిలా కాకుండా వీళ్లు ప్రీవెడ్డింగ్‌ను క్రికెట్ మ్యాచ్‌తో జరుపుకున్నారు. అమ్మాయి తరుపు వాళ్లు ఒక టీమ్‌గా, అబ్బాయి తరుపు టీమ్ వాళ్లు ఒక టీమ్‌గా ఏర్పడ్డారు. ప్రీవెడ్డింగ్ క్రికెట్ మ్యాచ్‌ను గ్రాండ్‌ గా నిర్వహించారు. ఈ టీమ్స్‌కు స్మృతి, పలాష్ కెప్టెన్స్‌గా ఉన్నారు.

స్మృతిమంధాన(Smriti Mandhana) జట్టులో షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్‌, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్‌, రాధా యాదవ్‌, రిచా ఘోష్‌ ఉన్నారు. రెండు జట్ల మధ్య మ్యాచ్ ఆరంభం నుంచి కూడా చాలా సరదాగా, హోరాహోరీగా సాగింది. కానీ చివరికి విజయం సాధించి క్రికెట్‌లో తన పవర్‌ చూపుకుంది స్మృతి. ఈ మ్చాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Read Also: జామపండును ఇలా తింటేనే అధిక లాభాలు..!

Follow Us on: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!