epaper
Thursday, February 19, 2026
epaper

అర్హులందరికీ అక్రిడేషన్​ కార్డులు : ఐఅండ్​పీఆర్​ స్పెషల్​ కమిషనర్​

కలం, వెబ్ డెస్క్​: రాష్ట్రంలోని అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ (Journalist Accreditation)​ కార్డులు అందిస్తామని తెలంగాణ ఇన్ఫర్మేషన్ అండ్​ పబ్లిక్​ రిలేషన్స్​(ఐఅండ్​పీఆర్​) స్పెషల్​ కమిషనర్​ సీహెచ్​ ప్రియాంక (CH Priyanka) తెలిపారు. జీవో నెం.252 ప్రకారం జర్నలిస్ట్​లకు అక్రిడేషన్​ కార్డులు జారీ చేస్తామని చెప్పారు. దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైందన్నారు.

అర్హులైన ప్రింట్​, ఎలక్ట్రానిక్​, డిజిటల్​, ఫ్రీలాన్స్​, వెటరన్​ జర్నలిస్ట్​లు ipr.telangana.gov.in వెబ్​సైట్​ ద్వారా ఆన్​లైన్​లో అప్లయ్​ చేసుకోవాలని సూచించారు. ​దరఖాస్తు సమయంలో ఏవైనా టెక్నికల్​ సమస్యలు వస్తే మీడియా రెగ్యులేషన్​ విభాగాన్ని ఫోన్​ ద్వారా సంప్రదించవచ్చని తెలిపారు. దీనికోసం ఆఫీస్​ పనివేళల్లో 9154170881 నెంబర్​కు కాల్​ చేసి, సమస్యను వివరించవచ్చని పేర్కొన్నారు. (Journalist Accreditation) ఈ మేరకు ఐపీఆర్​డిపార్ట్​మెంట్​ ‘ఎక్స్​’ ఖాతాలో ఓ ట్వీట్​ను ఆమె పోస్ట్​ చేశారు.

Read Also: నెదర్లాండ్ టార్గెట్ 194.. ఇండియా 193/6

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>