కలం, వెబ్ డెస్క్: తమ దారికి అడ్డుపడే వాళ్లను అడ్డు తొలగించుకోవడమే అమెరికా, చైనా విధానమని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) అధినేత మోహన్ భగవత్ (Mohan Bhagwat) మండిపడ్డారు. బుధవారం లక్నో యూనివర్సిటీలోని మాలవీయ ఆడిటోరియంలో జరిగిన ‘శోధార్థి సంవాద్’ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
‘పశ్చిమ దేశాలు ఫండమెంటలిజాన్ని వ్యాపింపచేస్తున్నాయి. అత్యంత శక్తిమంతంగా మారాలనేది వాటి ఆలోచన. స్వప్రయోజనాలే వాటి లక్ష్యం. తమ అవసరాల కోసమే పాకులాడతాయి. మిగిలిన ప్రపంచం ఏమైపోయినా ఫర్వాలేదు. తమ ప్రయోజనాలే వాటికి ముఖ్యం. ఆ క్రమంలో తమ దారికి అడ్డుపడే వాళ్లను అడ్డుతొలగించుకోవడానికి కూడా అవి వెనకాడవు. ప్రస్తుతం అమెరికా, చైనా చేస్తున్నది ఇదే’ అని ఆయన మోహన్ భగవత్ అన్నారు.
పరిష్కారాలు భారత్ చేతిలో..
ప్రస్తుతం ప్రపంచం అనేక సమస్యలు ఎదుర్కొంటోందని, వాటికి పరిష్కారాలు భారత్ వద్ద ఉన్నాయని మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు. ‘భారత్ ప్రపంచ నాయకత్వం సాధించాలంటే అన్ని రంగాల్లోనూ శక్తిమంతంగా మారాలి. సత్యానికి బలం తోడైతే ప్రపంచం మనల్ని నమ్ముతుంది. అప్పుడే భారత్ అత్యున్నత స్థాయికి ఎదుగుతుంది. ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు భారత్ వద్ద సమాధానాలు ఉండడం దీనికి మూలం’ అని ఆయన (Mohan Bhagwat) అన్నారు.
Read Also: అది అత్యాచారయత్నమే : సుప్రీం కోర్టు
Follow Us On: Youtube


