కలం, ఖమ్మం బ్యూరో : దేశంలో సుమారు ఇరవై రాష్ట్రాల్లో స్వంతంగా లేదా మిత్రపక్షాలతో కలిపి బీజేపీ అధికారంలో ఉంది. ఇంత పెద్ద జాతీయ పార్టీకి ఖమ్మం (Khammam) జిల్లాలో చుక్కెదురైంది. జిల్లాలోని ఏదులాపురం (Yedulapuram) మున్సిపాలిటీలోని 12వ వార్డులో బీజేపీకి ఒక్క ఓటు కూడా రాలేదు. ఈ వార్డు బీసీ జనరల్‌కు రిజర్వ్ అయింది. కాలేరు వెంకటేశ్వర్లు అనే వ్యక్తి బీజేపీ తరపున పోటీ చేయగా ఆయనకు ఒక్క ఓటు కూడా పడలేదు. అయితే ఆయన తన ఓటు కూడా వేసుకోలేదా అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కానీ నోటాకు ఆరు ఓట్లు రావడం.. ఆశ్చర్యం కలిగించింది. ఏదులాపురం మున్సిపాలిటీలో (Yedulapuram Municipality) మొత్తం 32 వార్డులు ఉండగా, కాంగ్రెస్ 24 స్థానాలు కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ 2, సీపీఎం 2, సీపీఐ 3, ఇండిపెండెంట్ ఒక సీటు గెలుపొందారు. కాగా జిల్లా మొత్తం మీద బీజేపీ ఒక్క వార్డులో కూడా ఖాతా తెరవలేకపోయింది.
Read Also: ప్రతిపక్షంలో ఉన్నా ఆదరించారు.. నమ్మకంగా పని చేయండి
Follow Us On: Sharechat


