కలం, వెబ్ డెస్క్ : వరంగల్ (Warangal) ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ములుగు (Mulugu), భూపాలపల్లి (Bhupalpalli) అటవీ శివారు ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించగా, భద్రతా బలగాలు భారీగా మోహరించాయి. అటవీ ప్రాంతాల్లో మావోయిస్టు దళం (Maoist Force) సంచరిస్తున్నట్లు వచ్చిన విశ్వసనీయ సమాచారంతో పోలీసులు, ప్రత్యేక సాయుధ బలగాలు అప్రమత్తమయ్యాయి. దీంతో ములుగు, భూపాలపల్లి, వరంగల్ జిల్లాల సరిహద్దు గ్రామాల్లో విస్తృతంగా కూంబింగ్ ఆపరేషన్లు (Combing Operations) కొనసాగుతున్నాయి.
అడవుల్లో అనుమానాస్పద కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ప్రధాన రహదారులు, అటవీ మార్గాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి.. వాహనాలు, వ్యక్తులను సోదాలు చేస్తున్నారు. గ్రామాల్లోకి వెళ్లే దారుల వద్ద కూడా భద్రత కట్టుదిట్టం చేశారు. పోలీసు ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఈ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా కదలికలు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని అధికారులు సూచించారు.
Read Also: వివాదాల ‘ఇంపాక్ట్’.. ఏఐ సమ్మిట్లో రోబో డాగ్ రభస
Follow Us On : WhatsApp


