epaper
Wednesday, February 18, 2026
epaper

ఐదేళ్లుగా పేపర్ లీకేజీ.. సీఐడీ దర్యాప్తులో సంచలన నిజాలు

కలం, వెబ్​ డెస్క్​ : వరంగల్ వ్యవసాయ విశ్వవిద్యాలయం (Agricultural University)లో గత కొంతకాలంగా సాగుతున్న పేపర్​ లీకేజీ వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇన్ సర్వీస్ విద్యార్థులకు ప్రశ్నాపత్రాలను లీక్ చేస్తున్న ఉదంతంపై సీఐడీ అధికారులు చేపట్టిన దర్యాప్తులో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. కేవలం ఈ ఏడాది మాత్రమే కాకుండా, గత ఐదేళ్లుగా ఈ అక్రమ దందా కొనసాగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి థర్డ్ ఇయర్ ప్రశ్నాపత్రాలు బయటకు రావడం కలకలం రేపుతోంది.

ఈ వ్యవహారంలో వర్సిటీకి చెందిన జూనియర్ అసిస్టెంట్ కార్తీక్ (Jr Assistant Karthik) కీలక పాత్ర పోషించినట్లు దర్యాప్తులో తేలింది. అతను విశ్వవిద్యాలయం నుండి ప్రశ్నాపత్రాలను సేకరించి, ఇన్ సర్వీస్ విద్యార్థులకు చేరవేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా వరంగల్, జగిత్యాల, ఆదిలాబాద్, రాజేంద్రనగర్, సిరిసిల్ల, అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలల్లోని విద్యార్థులకు ఈ లీకైన పేపర్లు (Paper Leak) అందినట్లు సీఐడీ ప్రాథమికంగా నిర్ధారించింది.

ఈ అక్రమ మార్గం ద్వారా లక్షలాది రూపాయలు చేతులు మారినట్లు అధికారులు భావిస్తున్నారు. పరీక్షలకు ముందే ప్రశ్నలు అందుతుండటంతో, ఇన్ సర్వీస్ కోటాలో ఉన్న వారు భారీ మొత్తాలను వెచ్చించి వీటిని కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెట్‌వర్క్‌లో కేవలం కార్తీక్ మాత్రమే ఉన్నాడా లేక ఉన్నతాధికారుల హస్తం కూడా ఉందా అనే కోణంలో సీఐడీ విచారణ జరుపుతోంది.

Read Also: హామీ 42%.. గెలిచింది 62%.. ‘మున్సిపోల్స్’లో రిజర్వేషన్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>