Mobile Popup Ad
Mobile Popup Ad

AA23 : అనౌన్స్మెంట్ థీమ్ సంచలనం.. షూటింగ్ బిగ్ అప్డేట్

కలం, సినిమా : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), తమిళ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) కాంబినేషన్ అంటేనే ఫ్యాన్స్‌లో ఊహించని ఉత్సాహం వచ్చింది. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్  ఈ మాసివ్ కాంబినేషన్‌తో ఓ బిగ్గెస్ట్ మూవీ (AA23) అనౌన్స్ చేస్తూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది. ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్(Anirudh) మ్యూజిక్ అందిస్తున్నట్లు ప్రకటించారు. అయితే అనౌన్స్మెంట్ వీడియోకి అనిరుధ్ ఇచ్చిన థీం మ్యూజిక్ సంచలనం సృష్టించింది. ఆ థీమ్ మ్యూజిక్‌తో ఇంస్టాగ్రామ్‌లో వరుస రీల్స్ వచ్చాయి.

తాజాగా AA23 థీమ్ మ్యూజిక్ ఇంస్టాగ్రామ్ రీల్స్‌లో ఏకంగా వన్ మిలియన్ (10 లక్షలు) మార్కు దాటిందంటూ మైత్రి మూవీస్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేసింది. అల్లు అర్జున్, లోకేశ్ కనగరాజ్ మాసివ్ కాంబినేషన్ మూవీ రిలీజ్‌కి ముందే చరిత్ర సృష్టించిందని.. ఈ ఏడాదే షూటింగ్ మొదలు పెడుతున్నామంటూ మైత్రి మూవీస్ ప్రకటించింది. ఇప్పటికే అల్లు అర్జున్, అట్లీ డైరక్షన్‌లో ఓ బిగ్గెస్ట్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ మూవీ వచ్చే ఏడాది రిలీజ్ అవుతుంది. దీనితో వచ్చే ఏడాది అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి డబుల్ ట్రీట్ ఉండనుంది.

Read Also: వారణాసి : ఆ ఒక్క ఎపిసోడ్ కోసమే 300 కోట్లు ?

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>