కలం, వెబ్ డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ (Revanth Reddy) పర్యటనకు బయలుదేరారు. ముంబైలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు. బుధవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఢిల్లీకి చేరుకోనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. AI ఇంపాక్ట్ సమ్మిట్-2026లో (AI Impact Summit) భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Modi) ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించనున్న డిన్నర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. దేశంలోని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, సాంకేతిక రంగ ప్రతినిధులు అంతర్జాతీయ అతిథులు ఈ విందులో పాల్గొనే అవకాశముందని ఉందని తెలుస్తోంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో పెట్టుబడులు, సాంకేతిక సహకారం, భవిష్యత్ అభివృద్ధి అవకాశాలపై ఈ సమ్మిట్ కీలకంగా భావిస్తున్నారు. తెలంగాణను ఏఐ, డిజిటల్ ఇన్నోవేషన్ హబ్‌గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్న నేపథ్యంలో సీఎం ఈ సమావేశానికి హాజరు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గురువారం ఉదయం మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026 ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా సాంకేతిక సంస్థల ప్రతినిధులతో సమావేశాలు, పెట్టుబడుల అవకాశాలపై చర్చలు కూడా జరిగే అవకాశముందని అధికారులు తెలిపారు.
Read Also: గోడమీది పిల్లి!.. యథేచ్ఛగా పార్టీ ఫిరాయింపులు
Follow Us On : WhatsApp


