మ‌రోసారి చిరు లీక్స్‌.. ‘కాకా’ మూవీపై అప్‌డేట్‌!

క‌లం, సినిమా: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కాకా’. చిరంజీవి డ్యుయ‌ల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. బాబీ కొల్లి డైరెక్ష‌న్‌లో వ‌స్తున్న ఈ సినిమాను కేవీఎన్ ప్రొడ‌క్ష‌న్స్‌, హ్యాష్‌ట్యాగ్ మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ డైరెక్ట‌ర్‌ అనురాగ్ కశ్యప్, సీనియ‌ర్ హీరోయిన్ ప్రియమణి, సునీల్, నివేతా థామస్, నివేతా పేతురాజ్, అనస్వరా రాజన్ (Anaswara Rajan), మురళీ శర్మ త‌దిత‌రులు న‌టిస్తున్నారు. అలాగే మ‌ళ‌యాల సూప‌ర్ స్టార్‌ మోహన్ లాల్ ఈ మూవీలో గెస్ట్ రోల్‌లో క‌నిపించ‌నున్నారు. త‌ర‌చూ త‌న సినిమాల‌కు సంబంధించి పొర‌పాటున ఏదో ఒక లీక్ ఇచ్చే మెగాస్టార్ కాకాకు సంబంధించి కూడా ఓ వేదిక‌గాపై అప్‌డేట్ ఇచ్చారు.

తాజాగా మెగాస్టార్ ఇట్లూ అర్జున మూవీకి సంబంధించిన ఓ ఈవెంట్‌కు హాజ‌ర‌య్యారు. ఈ సినిమాలో అన‌స్వ‌ర రాజ‌న్ (Anaswara Rajan) హీరోయిన్‌గా న‌టించింది. ఈ వేడుక‌లో చిరు నేను ఎక్కువ మాట్లాడితే ఏదో ఒక లీక్ చేస్తాన‌ని భ‌యంగా ఉందంటూ కామెడీ చేశారు. అప్పుడే యాంక‌ర్ మీరు గ‌తంలో చేసిన లీక్‌ల టైమ్‌లో నేను యాంక‌రింగ్ చేశాను.. ఇప్పుడు కూడా నేనే ఉన్నాను.. ఏదో ఒక లీక్ చేయండంటూ రిక్వెస్ట్ చేసింది. అప్ప‌డు చిరు అన‌స్వ‌ర రాజ‌న్‌ను మాట్లాడ‌మ‌ని కోరారు. మైక్ ఇచ్చినా ఆమె మాట్లాడేందుకు ముందుకు రాలేదు. దీంతో చిరు ఆమె మాట్లాడ‌దు. చాలా మంచి అమ్మాయి అంటూ కామెంట్ చేశారు. దీంతో కాకాలో అన‌స్వ‌ర క్యారెక్ట‌ర్ డెఫ్ అండ్ డంబ్ అయ్యి ఉంటుంద‌ని ఫ్యాన్స్ వైర‌ల్ చేసేస్తున్నారు. కాకా సినిమా సంక్రాంతి కానుక‌గా 2027లో విడుద‌ల కానుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>