కాకతీయుల నాటి ఆలయానికి కొత్త వెలుగులు

కలం, కరీంనగర్: కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలోని కాకతీయుల కాలం నాటి చారిత్రక పురాతన త్రికుటాలయానికి ఎట్టకేలకు చీకట్లు వీడాయి. ఆలయ పునరుద్ధరణలో భాగంగా ఆలయానికి ‘శ్రీ త్రికోటేశ్వరాలయం’గా (Sri Trikoteswara Temple) నామకరణం చేయడంతో పాటు విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయడంతో ఆలయ ప్రాంగణం నూతన శోభను సంతరించుకుంది. పూజ్య గురువులు శ్రీ సురేష్ ఆత్మారామ్ మహారాజ్ ఆధ్వర్యంలో సుమారు 120 మంది భక్తుల సమక్షంలో ఈ కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, కొబ్బరికాయలు కొట్టి ఆలయానికి నూతన నామకరణం చేశారు.

గత కొంతకాలంగా సరైన వెలుతురు లేక చీకటిలో మగ్గిన ఈ పురాతన ఆలయం చుట్టూ విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయడంతో ప్రస్తుతం ఆ ప్రాంతమంతా కొత్త వెలుగులతో కళకళలాడుతోంది. ఆలయ ప్రాంగణం నూతన శోభను సంతరించుకోవడంతో భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా గురువు శ్రీ సురేష్ ఆత్మారామ్ మహారాజ్ మాట్లాడుతూ.. మన పూర్వీకులు నిర్మించిన పురాతన దేవాలయాలను పరిరక్షించుకోవడం, వాటి చారిత్రక, ఆధ్యాత్మిక వైభవాన్ని భవిష్యత్ తరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పిలుపునిచ్చారు. స్థానిక ప్రజలు, భక్తుల సమష్టి సహకారంతో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసి పూర్వ వైభవం తీసుకురావాలని ఆకాంక్షించారు.

భక్తుల ఐక్యతకు నిదర్శనంగా నిలిచిన ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వహణ కమిటీ బాధ్యులు బండ గోపాల్ రెడ్డి, పెద్ది కుమార్, నాగరాజు శర్మ, తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ వ్యవస్థాపక చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి వూట్కూరి, రామేశ్వర రావు, గుండేటి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. వీరితో పాటు స్థానిక మహిళలు, పిల్లలు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఆలయ పునరుద్ధరణ పట్ల హర్షం వ్యక్తం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>