epaper
Wednesday, February 18, 2026
epaper

ఎంపీ రఘునందన్ రావు దిష్టిబొమ్మ దహనం

కలం, మెదక్ బ్యూరో : ఇస్నాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా బీజేపీ ఎంపీ రఘునందన్ (Raghunandan Rao) రావు బిఆర్ఎస్ పార్టీకి మద్దతుగా ఓటు వేయడంపై ఉద్రిక్తత నెలకొంది. దీనికి నిరసనగా సిద్దిపేట జిల్లా వంటిమామిడి వద్ద రాజీవ్ రహదారిపై బీసీ సంఘాలు, నీలం మధు వర్గీయులు మెదక్ ఎంపీ రఘునందన్ రావు దిష్టిబొమ్మను దహనం చేశారు.

ఇస్నాపూర్ మున్సిపల్ (Isnapur Municipality) పీఠం బీసీ వర్గానికి చెందిన నీలం కవితకు దక్కకుండా చేసేందుకు, ఎంపీ రఘునందన్ రావు బిఆర్ఎస్ పార్టీకి అమ్ముడుపోయారని నీలం వర్గీయులు, బీసీ నేతలు ఆరోపించారు. ఎక్స్ అఫిషియో ఓటును ఉపయోగించి మెదక్ ఎంపీ బీసీలకు అన్యాయం చేశారని వారు మండిపడ్డారు. బీసీలకు వ్యతిరేకంగా వ్యవహరించిన రఘునందన్ రావు (Raghunandan Rao)ను వెంటనే బీజేపీ నుండి సస్పెండ్ చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.

 Read Also: రాజేంద్రనగర్ లక్ష్మీగూడలో చదరపు గజం రూ.51 వేలు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>