epaper
Wednesday, February 18, 2026
epaper

నమీబియాతో పోరుకు పాక్ కీలక మార్పులు

కలం, వెబ్ డెస్క్:  టీ20 ప్రపంచకప్ 2026లో సూపర్-8 రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్థాన్ (Pakistan)  నేడు నమీబియాతో తలపడనుంది. కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్‌లో జరగనున్న ఈ మ్యాచ్ కోసం పాక్ జట్టు యాజమాన్యం తుది జట్టులో కీలక మార్పులు చేస్తోంది. టోర్నీ ఆరంభంలో చిరకాల ప్రత్యర్థి భారత్ చేతిలో ఘోర పరాజయం పాలైన పాకిస్థాన్ ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిలో ఉంది. గ్రూప్-Aలో రెండు విజయాలు, ఒక ఓటమితో -0.403 నెట్ రన్ రేటు కలిగి ఉన్న ఆ జట్టు ప్రస్తుతం మూడో స్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో నమీబియాపై విజయం సాధిస్తే పాక్ ఆరు పాయింట్లతో గ్రూప్-Aలో రెండో స్థానానికి చేరుకుని సూపర్-8 బెర్తును ఖరారు చేసుకుంటుంది.

ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ ఉద్వాసనపై వస్తున్న వార్తలను జట్టు వర్గాలు తోసిపుచ్చాయి. అతను జట్టులో కొనసాగుతారని స్పష్టం చేశాయి. అయితే బాబర్ ఆజం, సైమ్ అయూబ్‌లు ఓపెనింగ్‌కు వస్తే, ఫర్హాన్‌ను నాలుగో స్థానంలో పంపే అవకాశం ఉందని సమాచారం. అలాగే ఆల్‌రౌండర్ ఫహీమ్ అష్రఫ్ స్థానంలో యువ బ్యాటర్ ఖవాజా మహ్మద్ నఫాయ్‌ను తుది జట్టులోకి తీసుకోనున్నారు.

సింహళీస్ క్లబ్ పిచ్‌పై గడ్డి కనిపిస్తుండటంతో స్పిన్నర్ల కంటే పేసర్లకే మొగ్గు చూపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ స్థానంలో ఫాస్ట్ బౌలర్ సల్మాన్ మీర్జాను బరిలోకి దించాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>