కలం, వెబ్ డెస్క్: పెళ్లి అంటే వధూవరులపై పూలు, మెరుపులు, పసుపు వంటివి చల్లడం కామన్. కానీ, ఓ పెళ్లి వేడుకలో వధువుపై ఏకంగా నోట్ల (Cash) వర్షం కురిపించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా (Social Media)లో వైరల్‌గా మారింది. పంజాబ్ (Punjab)లో జరిగిన ఓ పెళ్లి (Wedding)లో ఈ ఘటన జరిగింది. పెళ్లి కొడుకుతో పాటు బంధువులంతా పెళ్లి కూతురుపై నోట్ల వర్షం కురిపించారు. కొందరు అక్కడ కింద పడ్డ నోట్లను ఏరుకున్నారు. ఆ నోట్లపైనే అందరూ డ్యాన్స్ చేశారు. అయితే ఈ వేడుకలో ఎంత డబ్బు చల్లారన్నది చర్చనీయాంశంగా మారింది. సుమారు రూ.8.5 కోట్లు చల్లారని సోషల్ మీడియాలో పుకార్లు పుట్టుకొచ్చాయి. వీడియో బాగా వైరల్ అయ్యి, డబ్బు గురించి విపరీతంగా చర్చ నడుస్తుండటంతో వధువు సోదరుడు సికందర్ సింగ్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని. తన సోదరి వివాహంలో అంత డబ్బు చల్లలేదని చెప్పారు. అయితే లక్షల్లో డబ్బు చల్లినట్లు స్పష్టం చేశారు. కోట్లల్లో అయినా.. లక్షల్లో అయినా.. ఎంత రిచ్ అయినా అలా డబ్బులు చల్లడం ఏంటని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.


