epaper
Wednesday, February 18, 2026
epaper

మాజీ మంత్రి అంబటికి బెయిల్

కలం, గుంటూరు బ్యూరో: మాజీ మంత్రి అంబటి రాంబాబుకు (Ambati Rambabu)  బెయిల్ మంజూరైంది. ఆయన మీద ఏపీ పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. జనవరి 31 నుంచి అంబటి జైళ్లోనే ఉన్నారు. సత్తెనపల్లిలో చంద్రబాబును దూషించిన కేసులో, పోలీసులతో అనుచితంగా ప్రవర్తించడం, సంక్రాంతి సంబురాల పేరుతో లక్కీ డ్రా నిర్వహించడం వంటి కేసులు ఆయన మీద నమోదయ్యాయి. అయితే ఇప్పటికే  రెండు కేసుల్లో ఆయనకు బెయిల్ మంజూరైంది. సంక్రాంతి సంబురాల సందర్భంగా లక్కీ డ్రా కేసుకు సంబంధించిన కేసులో బెయిల్ మంజూరు చేయాలని అంబటి (Ambati Rambabu)  గుంటూరు కోర్టును ఆశ్రయించారు. మరోవైపు పోలీసులు ఈ కేసులో అంబటిని విచారించాలంటూ కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. బుధవారం ఈ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు కస్టడీ పిటిషన్ కొట్టేసి అంబటికి బెయిల్ మంజూరు చేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>